ప్రభుత్వ సూచనల ప్రకారం బయోమెట్రిక్ హాజరు అమలు..

నవతెలంగాణ- డిచ్ పల్లి
ప్రభుత్వ సూచనల ప్రకారం తెలంగాణ యూనివర్సిటీ లో టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది అందరికీ నేటి నుండి బయోమెట్రిక్ హాజరు అమలు చేయబడుతుందని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ యాదగిరి శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బయోమెటిక్ అటెండెన్స్ అన్ని టీచింగ్ & నాన్-టీచింగ్ స్టాప్స్ కు వర్తించే విధంగా సర్క్యులర్ ను జారీ చేశారు. తెలంగాణ యూనివర్సిటీ లోని టీచింగ్ & నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ, 01-జూలై నుండి 3వ వరకు ప్రభుత్వ సూచనల ప్రకారం బయోమెట్రిక్ హాజరు అమలు చేయబడుతుందని టీచింగ్ & నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ బయోమెట్రిక్ హాజరు కోసం థంబ్ ఇంప్రెషన్‌ను నిర్ణీత కార్యాలయ సమయాల్లో (ఉదయం 10:00 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు) వేయాల్సి ఉంటుందని వివరించారు. టీచింగ్ & నాన్-టీచింగ్ స్టాఫ్ సభ్యులందరూ గరిష్టంగా అనుమతించదగిన 30 నిమిషాల గ్రేస్ సమయం తో కార్యాలయ సమయాలకు కట్టుబడి ఉండాలని సూచించారు. అయితే గ్రేస్ టైమ్‌ను అసాధారణమైన మరియు అత్యవసర ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందని, ఒక నెలలో మూడు సార్లకు మించిన వ్యత్యాసాల విషయంలో, అది ఒక రోజు గైర్హాజరుగా పరిగణించబడుతుందని, తదుపరి సమాచారం లేకుండానే సంబంధిత సిబ్బంది కి సెలవు ఖాతా (సిఎల్/ఈఎల్/ఎల్ఓపి) నుండి డెబిట్ చేయబడుతుందని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి పేర్కొన్నారు. నియంత్రిత అధికారులందరికీ ఎలాంటి ఫిరాయింపులు లేకుండా కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించడం జరిగిందని, సిబ్బంది నియంత్రణలో పనిచేస్తున్న టీచింగ్ & నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ ఇదే ఆదేశాలు అమలౌతుందని రిజిస్ట్రార్ వివరించారు.

Spread the love