రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక..నేడు, రేపు పలు రైళ్ల రద్దు

నవతెలంగాణ-హైదరాబాద్ : ఖరగ్‌పుర్‌ డివిజన్‌లో భద్రతాపరమైన పనులు జరుగుతున్న కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి మంగళవారం తెలిపారు. బుధవారం.. పుదుచ్చేరి-హావ్‌డా (12868), షాలిమార్‌-హైదరాబాద్‌ (18045), హైదరాబాద్‌-షాలిమార్‌ (18046) ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, విశాఖ-షాలిమార్‌ (22854), షాలిమార్‌-సికింద్రాబాద్‌ (12773), ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-షాలిమార్‌ (22826), హావ్‌డా-సత్యసాయి ప్రశాంతి నిలయం (22831), తాంబరం-సంత్రాగచ్చి (22842), షాలిమార్‌-సికింద్రాబాద్‌ (22849), గురువారం.. ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-సంత్రాగచ్చి (22808), ఎస్‌ఎంవీ బెంగళూరు-హావ్‌డా (22888) రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు.

Spread the love