పలురైల్వే స్టేషన్లలో ఆగనున్న ముఖ్యమైన రైళ్లు

పెండింగ్‌లో ఉన్న రిక్వెస్ట్‌లకు రైల్వే శాఖ అంగీకారం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సూదూర ప్రాంతాలకు వెళ్లే పలు ముఖ్యమైన రైళ్లను తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ముఖ్యమైన స్టేషన్లలో ఆపాలంటూ దీర్ఘకాలంగా తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చేస్తున్న డిమాండ్లపై కేంద్రమంత్రి శ్రీ జి.కిషన్‌ రెడ్డి చేసిన సూచనకు రైల్వే మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించింది. రైల్వే మంత్రి అశ్విణివైష్ణవ్‌ సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయాన్ని రైల్వే శాఖ వెల్లడించింది. తెలంగాణలో బెల్లంపల్లి, సిర్పూర్‌-కాగజ్‌నగర్‌, మహబూబ్‌నగర్‌, షాద్‌నగర్‌, గద్వాల్‌ రైల్వే స్టేషన్లలో, ఆంధ్రపదేశ్‌లోని పిడుగురాళ్ల, నడికుడి, సత్తెనపల్లి, డోర్నకల్‌, బొబ్బిలి, దువ్వాడ, పీలేరు స్టేషన్లలో వివిధ రైళ్లను ఆపనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ మార్పులు త్వరలోనే అమల్లోకి రానున్నాయి.

Spread the love