జీవిత ప్రమాణాలను మెరుగుపరచుకోండి

నవతెలంగాణ-బంజారాహిల్స్‌
వరల్డ్‌ నో టొబాకో దినం సందర్భంగా బుధవారం బంజారాహిల్స్‌ కేబీఆర్‌ పార్క్‌ ప్రధాన గేటు వద్ద నుంచి నిర్వహించిన వాకథాన్‌ను ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, సీఈఓ డా.సాయి రవి శంకర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాకథాన్‌ రోడ్డు నెంబర్‌ 12 మీదుగా విరంచి సర్కిల్‌ వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పొగాకు వినియోగం వల్ల ఎన్నో అనర్థాలున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ పొగతాగడం మాని వేయాలని విజ్ఞప్తి చేశారు. పొగాకు వినియోగం కేవలం సిగరేట్లు, బీడీల రూపంలోనే కాకుండా ఇపుడు ఖైనీ, గుట్కా లాంటి ఎన్నో పేర్లతో వాడుతున్నారనీ, అవి ఇంకా ప్రమాదకరమైనవి ఆయన హెచ్చరించారు. వీటన్నింటికి దూరంగా ఉంటూ ప్రజలు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంభిస్తూ జీవన ప్రమాణాలను పెంచుకోవాలని సూచి ంచారు. సీఈఓ డా.సాయి రవి శంకర్‌ కన్సల్టెంట్‌ కార్డియా లజిస్టు మాట్లాడుతూ పొగాకు వినియోగం పెరగడం వల్ల చిన్న వయసులో గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతోం దని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు, అందులోనూ యువత పొగాకు, మద్యపానం, చైనీ గుట్కా వదలి పెట్టాలని సూచించారు. వైస్‌ ఛైర్మన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వి.సత్యన్నారాయణ మాట్లాడుతూ 2023 ప్రపంచ నో టోబొకో దినం థీమ్‌ ప్రకారం ఆహారాన్ని పండించండి పొగాకును కాదు అన్న విధంగా ప్రజలు టొబాకో వినియోగమే కాకుండా పండించడం కూడా మానివేయాల ని సూచించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్‌ దేవి గుత్తా, కన్సల్టెంట్‌ గైనకాలజిస్టు, డా.రవి తేజ, కన్సల్టెంట్‌ పల్మనాలజిస్టు, పలువురు వైద్యులు, సిబ్బంది, పలు కార్పొరేట్‌ సంస్థల సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love