నాలుగు పోలింగ్ దశల్లో ఇండియా కూటమిదే పైచేయి: ఖర్గే

నవతెలంగాణ – ఢిల్లీ:  నాలుగు దశల ఎన్నికలు ముగిసేసరికి విపక్ష ఇండియా కూటమి బాగా బలపడిందని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే అభిప్రాయపడ్డారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో కలిసి ఆయన లఖ్‌నవూలో జరిగిన విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..తమ కూటమి అధికారంలోకి వస్తే ప్రతీ పేదవాడికి 10 కిలోల రేషన్‌ ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు.‘‘నాలుగు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. ఇండియా కూటమి చాలా బలపడింది. జూన్‌ 4వ తేదీన ప్రజలు మోడీని ఇంటికి సాగనంపేందుకు సిద్ధమయ్యారు. మా కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతోంది.  హైదరాబాద్‌లో ఓ మహిళా అభ్యర్థి బుర్ఖాలు తీయించి ఓటర్లను పరీక్షిస్తోంది. దీనిని ఎన్నికలు స్వేచ్ఛగా జరగడం అంటామా..?’’ అని ఖర్గే ఆవేదన వ్యక్తంచేశారు.

Spread the love