మరో 36 గంటల్లో తీవ్ర రూపం దాల్చనున్న బిపర్‌ జోయ్‌

ఢిల్లీ: అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపర్‌ జోయ్‌’ తుపాను మరో 36 గంటల్లో తీవ్ర రూపం దాల్చనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గోవా, ముంబయికి పశ్చిమ నైరుతి దిశలో ఇది కేంద్రీకృతమై ఉంది. రాబోయే రెండ్రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా కదలనుంది. ఈ నేపథ్యంలో అరేబియా సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Spread the love