సీబీఐ కేసుల్లో

– వాంగ్మూలాల నమోదుకు మేజిస్ట్రేట్‌ల నియామకం
ఇంఫాల్‌ : మణిపూర్‌లో జాతి హింసకు సంబంధించి సీబీఐ విచారిస్తున్న 27 కేసుల్లో సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసేందుకు మణిపూర్‌ హైకోర్టు 13 మంది మేజిస్ట్రేట్‌లను నియమించింది. మణి పూర్‌ రాష్ట్రంలోని మొత్తం పరిస్థి తిని పరిగణనలోకి తీసుకుని, వారి ప్రాదేశిక అధికార పరిధితో సంబం ధం లేకుండా వారు(మేజిస్ట్రేట్‌లు) స్టేట్‌మెంట్‌లను రికార్డ్‌ చేస్తారని హైకోర్టు వివరించింది. ఆగస్టు 25న సుప్రీంకోర్టు వెలువరించిన ఆదేశా లకు అనుగుణంగానే హైకోర్టు తాజా నోటిఫికేషన్‌ వెలువడింది. సీబీఐ కేసుల్లో తమ పనిని ఎలా ప్రారంభిం చాలనే దానిపై మణిపూర్‌ హైకోర్టు నుంచి తదుపరి సూచనల కోసం వేచి ఉండటంతో పాటు, ఈ న్యాయమూర్తులు స్థానికంగా దర్యాప్తు చేస్తున్న 6,000 కేసులలో కూడా సెక్షన్‌ 164 ప్రకారం స్టేట్‌మెంట్‌లను నమోదు చేయడంలో పెద్దగా పురోగతి లేదని కోర్టు పేర్కొన్నది.

Spread the love