జనగర్జనకు భారీ జన సమీకరణే లక్ష్యం – ఇంచార్జి మల్లారెడ్డి రామిరెడ్డి 

నవతెలంగాణ – అశ్వారావుపేట
మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ ముగింపు,ఖమ్మం వైఎస్ఆర్ సీపీ పూర్వ ఎంపి,తెలంగాణ రాష్ట్ర సమితి పూర్వ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరిక సందర్భంగా ఖమ్మం లో ఆదివారం నిర్వహిస్తున్న జన గర్జన సభకు అశ్వారావుపేట నియోజక వర్గం నుండి 25 వేల మందిని తరలించడం మే లక్ష్యంగా ఉన్నాం అని ఈ సభ ఇంచార్జి మల్లారెడ్డి రామిరెడ్డి తెలిపారు. జన సమీరకణే లక్ష్యంగా అన్ని వర్గాలను కలుపుకు పోయేందుకు స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహం ప్రాంగణం లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.ఈ బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేత,మాజీ ఎం.పీ రాహుల్ గాందీ,పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాజరు అవుతున్నందుకు ప్రతీ కార్యకర్తగా,నాయకుడు,అనుచరులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.కర్నాటకలో అవలంబించిన రాజకీయ ఎత్తుగడలు,ఎన్నికల వ్యూహాలను ఇక్కడ అమలు చేయడానికి అక్కడి వ్యూహ కర్త డీకే శివకుమార్ తెలంగాణ ఇంచార్జి గా రానున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే,పీసీసీ నాయకులు తాటి వెంకటేశ్వర్లు,జారే ఆదినారాయణ,మొగళ్ళపు చెన్నకేశవరావు,జూపల్లి రమేష్,సుంకవల్లి వీరభద్రరావు,జ్యేష్ట సత్యనారాయణ చౌదరి,ఎం.పి.టీ.సీ లు వేముల భారతి,నండ్రు జయ భారతి,సర్పంచ్,ఉపసర్పంచ్ లు అట్టం రమ్య,కేదార్ నాధ్ లు పాల్గొన్నారు.
Spread the love