కొత్తూరులో నీటి ఇక్కట్లు..రోడ్డు ఎక్కిన మహిళలు..

నవతెలంగాణ – అశ్వారావుపేట 

గత కొన్నేళ్ళుగా మంచినీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో విసిగి వేసారిన మహిళలు కాలీ బిందెలు తో రోడ్డు పై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో 4 గంటలు పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మండలంలోని గుమ్మడవల్లి పంచాయితీ కొత్తూరు ను గత కొంత కాలంగా నీటి ఎద్దడి ఇబ్బంది పెడుతుంది.ఈ గ్రామంలో 140 కుటుంబాలు,500 ఫై చిలుకు జనాభా ఉంటుంది.వీరి రోజువారీ నీటి అవసరాల కోసం రెండు బోరు బావులు ఉన్నాయి.అంతే గాకుండా మిషన్ భగీరథ పధకం ద్వారా మంచినీటి సరఫరా సౌకర్యం ఉంది. కానీ ఈ ఊరి నీటి అవసరాల కోసం పెద్దవాగు లో ఫిల్టర్ బెడ్ – బోరు బావి లోని మోటారు తరుచూ మరమ్మత్తులకు లోనవడం,మిషన్ భగీరథ మంచినీరు సక్రమ సరఫరా లేకపోవడంతో గ్రామస్తులు రోజు వారీ నీటి అవసరాలు కోసం ఇక్కట్లకు గురి అవుతున్నారు.ఈ విషయం అయి గతంలో అనేక సార్లు మండల స్థాయి అధికారులకు మొరపెట్టుకున్నారు.అయినా స్పందన లేదు.అసలు కే ఎండలు పెరిగిపోవడం తరుచూ మోటార్ మరమ్మత్తులకు గురి అవడంతో మంచినీటి ఎద్దడి తీవ్రంగా వెంటాడుతుంది.దీంతో గ్రామస్తులు శనివారం కాలీ బిందెలు తో వినాయక పురం వెలేరుపాడు ప్రధాన రహదారి పై బైఠాయించి నాలుగు గంటలు పాటు నిరసన తెలిపారు. విషయం తెలిసిన ఎం.పి.డి.ఒ శ్రీనివాస్,పంచాయితీ ప్రత్యేక అధికారి,ఎ.ఓ నవీన్ లు కొత్తూరు చేరుకుని సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం అని హామీ ఇచ్చారు.దీంతో గ్రామస్తులు శాంతించి నిరసన నిలిపివేసారు.
Spread the love