పాలకుర్తిలో తెలుగు దేశం సత్తా చాటుతాం

– పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిని వెంటనే ప్రకటించాలి 
– టీడీపీ మండల అధ్యక్షుడు బైన బిక్షపతి
నవతెలంగాణ పెద్దవంగర: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సత్తా చాటుతామని టీడీపీ మండల అధ్యక్షుడు బైన బిక్షపతి అన్నారు. మండల పరిధిలోని ఉప్పరగూడెం గ్రామంలో మంగళవారం పాలకుర్తి నియోజకవర్గ స్థాయి టీడీపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకుర్తి, తొర్రూరు మండలాల అధ్యక్షులు ల్యాబ్ వెంకన్న, బోగ భాస్కర్ తో కలిసి మాట్లాడారు. ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు పాటుపడుతూ అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలను అందించిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. గతంలో 9 ఏళ్లు సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు ముందుచూపుతోనే నేడు హైదరాబాద్‌ అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించిందన్నారు. ఆనాడు టీడీపీ ప్రభుత్వం వేసిన పునాదులపైనే నేడు ఐటీకి హైదరాబాద్ నగరం కేంద్రంగా మారి, వేలాది మంది యువతకు ఉద్యోగాలు వచ్చాయని గుర్తుచేశారు. తరువాత వచ్చిన ప్రభుత్వాలు నగరం కోసం చేసింది శూన్యమని విమర్శించారు. ఇరవై ఏళ్ల క్రితం వేసిన టీడీపీ పునాదులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గానికి పార్టీ అధిష్టానం వెంటనే ఇంచార్జిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న బీఆర్ఎస్ ను సాగనంపాలన్నారు. ప్రజలను మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తున్న బీఆర్ఎస్ పాలకులకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. కేసీఆర్ పాలనపై విసుగు చెందిన ప్రజలు స్వచ్ఛమైన పాలన అందించే టీడీపీ కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. కార్యకరంలో మాజీ ఎంపీటీసీ అహల్య కుమారస్వామి, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గణపురం ఎల్లయ్య, మండల ప్రధాన కార్యదర్శి బాషబోయిన యాకయ్య, మండల తెలుగు యువత అధ్యక్షుడు శనిగరం యాకాంబ్రం, పాలకుర్తి మండల కార్యదర్శి గుగులోతు రమేష్, టీఎన్ఎస్ఎఫ్ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శి పలుసాది ఉపేందర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు పెద్ది అనిల్, పాషం యాకయ్య, సోమ వీరన్న,తదితరులు పాల్గొన్నారు.
Spread the love