పల్నాడులో దారుణం.. కత్తులతో నరికి..

నవతెలంగాణ – అమరావతి: ఏపీలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ముగ్గురు దారుణ హత్యకు గురైన సంఘటన కలకలం రేపుతోంది. కోనంకి గ్రామంలో అర్ధరాత్రి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని సమీప బంధువులు విచక్షణారహితంగా కత్తులతో నరికి చంపారు. మృతులను సాంబశివరావు (50), భార్య ఆదిలక్ష్మి (47), కుమారుడు నరేష్‌ (30)గా పోలీసులు గుర్తించారు. ముప్పాళ్ల పీఎస్‌లో సాంబశిరావు కోడలు మాధురి, నిందితులు లొంగిపోయినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదైంది.
Spread the love