షెరాజ్ మెహ్ది దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమా ‘పౌరుషం – ది మ్యాన్‌హుడ్’. యువిటీ హాలీవుడ్ స్టూడియోస్ (యూఎస్‌ఏ), శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై అశోక్ ఖుల్లార్, దేవేంద్ర నేగి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే, మరోవైపు జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా చిత్ర ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఈ ట్రైలర్ రిలీజ్ వేడుకలో డాక్టర్ ఒలంపియా ఏ.జెలినీ, హాలీవుడ్ హీరోయిన్, సింగర్ ల్యూబా పామ్, అంబర్ మార్టినేజ్, సాగే, హాలీవుడ్ లక్స్ ఏంజెల్స్ స్టూడియోస్ కో- ప్రొడ్యూసర్ లెన్నీ విటుల్లి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఉమ్మడి కుటుంబంలో ఎదురయ్యే సవాళ్లు, పాత సంప్రదాయాలను ప్రశ్నించేలా ఉంది?, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ రెండూ ఉంటాయని ట్రైలర్ ద్వారా స్పష్టం చేశారు మేకర్స్. నేటి సమాజాన్ని ఆకర్షించే సన్నివేశాలతో కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచేసింది. సౌండ్‌ట్రాక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న ఈ చిత్రంలో సుమన్ తల్వార్, మేకా రామకృష్ణ, షెరాజ్, అశోక్ ఖుల్లార్, ఆమని, గీతా రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: షెరాజ్ మెహ్ది, డిఓపీ: కావేటి ప్రవీణ్.