ఆరో దశలో 63.37 శాతం పోలింగ్‌ నమోదు: ఈసీ

నవతెలంగాణ-హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరో దశలో జరిగిన పోలింగ్‌లో 63.37 శాతం ఓటింగ్ శాతం నమోదైందని భారత ఎన్నికల సంఘం మంగళవారం వెల్లడించింది. ఎనిమిది రాష్ట్రాల్లోని 58 స్థానాలకు మే 25న ఆరో దశ పోలింగ్ జరిగింది. 11.13 కోట్ల మంది ఓటర్లకు 7.05 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో, ఆరో దశ (పోలింగ్ జరిగిన ఏడు రాష్ట్రాల్లో 59 సీట్లు)లో 64.4 శాతం పోలింగ్ నమోదైంది. లోక్ సభ ఎన్నికల మొదటి ఆరు దశల్లో 87.54 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వారిలో 57.77 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక ఓటర్లు మన దేశంలో ఉన్నారు. మన దేశంలోని ఓటర్ల సంఖ్య 96.88 కోట్లుగా ఉంది. ఈసీ ప్రకారం, మే 20న జరిగిన ఐదో దశ పోలింగ్‌లో 62.2 శాతం, నాల్గవ దశలో 69.16 శాతం, మూడో దశలో 65.68 శాతం, రెండో దశలో 66.71 శాతం, మొదటి దశ పోలింగ్‌లో 66.14 శాతం నమోదైనట్లు ఈసీ వెల్లడించింది.

Spread the love