– పల్లె పశువుల వనాలకు ప్రాధాన్యత
– అటవీ శాఖ రాష్ట్ర స్థాయి వర్క్‌షాపులో పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రతీ అటవీ సమీప గ్రామాల్లో గడ్డి మైదానాలతో పల్లె పశువుల వనాల అభివృద్ధి ప్రాధాన్యత ఇవ్వబో తున్నట్టు రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం.డోబ్రియాల్ వెల్లడించారు. అన్ని జిల్లాల్లోనూ ఈ వనాలను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని అధికారులను ఆదేశిం చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో అటవీ శాఖ ఆధ్వర్యంలో అడవుల రక్షణ, నిర్వహణపై రెండో రోజూ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. తెలంగాణకు హరితహారం, అర్బన్ ఫారెస్ట్ పార్కుల నిర్వహణ, అటవీ సంరక్షణ చట్టం, అభివృద్ధి పనులకు అటవీ భూముల మళ్లింపు, అటవీ రక్షణ- విజిలెన్స్, ప్రత్యామ్నాయ అట వీకరణ (కంపా), ఎకో టూరిజం, ప్రొడక్షన్ తదితర అంశాలపై చర్చిం చారు. సంబంధిత విభాగాల పర్యవేక్ష కులుగా ఉన్న ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ద్వారా పురోగతిని సమీక్షిం చారు. ఈ సందర్భంగా డోబ్రియాల్ మాట్లాడుతూ.. హరితహారం విజయ వంతం కోసం క్షేత్రస్థాయి పరిశీలన మరింత పెరగాలని సూచించారు. అర్బన్ ఫారెస్ట్ పార్కులు స్వయం సమృద్ధి సాధించి నిర్వహణ ఖర్చులు రాబట్టుకునేలా చర్యలు తీసుకోవాల న్నారు. విద్యార్థులు, పర్యావరణ ఔత్సాహికులతో నేచర్ క్లబ్బులు ఏర్పాటు చేసి వనదర్శిని కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బాధ్యతాయుత మైన ఎకో టూరిజం అభివృద్ధి, నిర్వహణకు తగిన ప్రదేశాల ఎంపిక చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టు లు, రోడ్ల కోసం అటవీ భూముల మళ్లింపు నిర్ణయాల విషయంలో అటవీ సంరక్షణ చట్టం, కొత్త కేంద్ర నిబంధనలను పరిగణనలోకి తీసుకో వాలన్నారు. గిరిజన గ్రామాలకు రోడ్లు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటుకు వేగంగా అనుమతులివ్వాలని తెలి పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫైబర్ నెట్ వర్క్ ఏర్పాటుకు కూడా ఆటంకాలు లేకుండా చూడాలని సూచించారు. ఇంకా సమావేశంలో అటవీ భూము ల కచ్చితమైన సరిహద్దుల గుర్తింపు, అటవీ బ్లాక్‌ల నోటిఫికేషన్ ప్రకటన, ఫారెస్ట్ స్టేషన్ల ఏర్పాటు, కొత్త ఉద్యోగాల నియామకాలు, కలెక్టర్ల నేతృత్వంలో ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీల ఏర్పాటు, అటవీ రక్షణలో టెక్నాలజీ వినియోగం, తదితర అంశాలపై చర్చి ంచారు. వర్క్‌షాపులో పీసీసీఎఫ్ (విజిలెన్స్) ఏలూసింగ్ మేరు, పీసీసీ ఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) సువర్ణ, పీసీసీ ఎఫ్ (ఎఫ్‌సీఏ) ఎం.సీ. పర్గెయిన్, అదనపు పీసీసీఎఫ్‌లు వినరు కుమార్, సునీతా భగవత్, అన్ని అటవీ సర్కిళ్ల చీఫ్ కన్జర్వేటర్లు, కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్లు, అన్ని జిల్లాల ఫారెస్ట్ ఆఫీసర్లు, డివిజనల్ అధికారులు పాల్గొన్నారు.