వసంతకాల ప్రతిదాడి విఫలమైన నేపథ్యంలో

In the wake of the failed spring counter-offensive– అమెరికాలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడి చర్చలు
ఉక్రెయిన్‌ : ఉక్రెయిన్‌ తన ”వసంతకాల ప్రతిదాడి” ఘోరంగా విఫలమైన నేపథ్యంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తోను, రక్షణ మంత్రిత్వ శాఖ(పెంటగాన్‌) తోను, అమెరికా సెనేట్‌, హౌస్‌ సభ్యులతోను గంటల తరబడి చర్చలు జరిపారు. పశ్చిమ దేశాల మీడియా ఎంతగా గొప్పలు చెప్పినప్పటికీ ఉక్రెయిన్‌ ప్రతిదాడి రష్యా రక్షణ వలయాలను ఛేదించటంలో ఘోరంగా విఫలమైంది. గత నెలలో ఉక్రెయిన్‌ రక్షణ మంత్రిత్వ శాఖలో ప్రధానమైన వ్యక్తులందరినీ అమెరికా జోక్యంతో మార్చిపడేశారు. ఉక్రెయిన్‌ కు మరోసారి అమెరికా పెద్ద ఎత్తున అబ్రాం యుద్ధ ట్యాంకులతోసహా అత్యంత అధునాతన ఆయుధాలను అందించబోతోందని బైడెన్‌ స్వయంగా ప్రకటించారు.అయితే వాస్తవ పరిస్థితి వేరుగా ఉందని ప్రముఖ జర్నలిస్టు సెమోర్‌ హెర్ష్‌ అన్నాడు. ఒకవేళ ఉక్రెయిన్‌ సైన్యాన్నిగనుక రష్యాపైన దాడిని కొనసాగించమని ఆదేశిస్తే సైన్యం తిరుగుబాటు చేసేందుకు అవకాశం ఉందనే అంచనా అమెరికాకు ఉన్నట్టు తనతో ఒక సీనియర్‌ అమెరికన్‌ అధికారి అన్నట్టు ఆయన చెప్పాడు. ఎందుకంటే ఉక్రెయిన్‌ సైనికులు మరణించటానికి ఏమాత్రం సిద్దంగా లేరని ఆయన అన్నాడు. ప్రస్తుతం ఉక్రెయిన్‌ చేస్తున్న దాడిలో వేలాది ఉక్రెయిన్‌ సైనికులు చనిపోయారు. ఇప్పటివరకు చనిపోయిన ఉక్రెయిన్‌ సైనికుల సంఖ్య 100ల వేలుంది. ఒక అంచనా ప్రకారం ఈ సంఖ్య రెండు లక్షలకు మించివుంది.
ఉక్రెయిన్‌ యుద్ధంలో ఓడిపోతే అది 2024ఎన్నికల్లో తన విజయాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని బైడెన్‌ భయపడుతున్నాడు. అందుకే రష్యాతో ప్రత్యక్షంగా తలపడటం ద్వారా యుద్ధాన్ని ముగించే పరిస్థితిలేకుండా చేసే వ్యూహాన్ని బైడెన్‌ అమలుచేసేలా ఉన్నాడు.

Spread the love