వనస్థలిపురంలో వైద్యుల నిర్లక్ష్యం..పసికందు మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : వనస్థలిపురంలోని ఏరియా ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యులు చేసిన నిర్లక్ష్యంతో ఓ పసికందు ఈ ప్రపంచాన్ని చూడకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లింది. వివరాల్లోకి వెళ్లితే.. హయత్ నగర్ కి చెందిన శిరీష ప్రసవం కోసం వనస్థలిపురం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. ఈ తరుణంలోనే శిరీషకు పురిటి నొప్పులు రావడంతో.. డెలివరీ చేసేందుకు సిబ్బంధి ఆపరేషన్ థియేటర్ వద్దకు తీసుకెళ్లారు. శిశువు బొడ్డు పేగును డెలివరీ తరువాత కట్ చేయాల్సి ఉండగా.. ముందుగానే కట్ చేయడంతో ఉమ్మనీరు మింగి సర్జరీ జరుగుతుండగానే శిశువు ప్రాణాలు విడిచింది. దీంతో ఏమి చేయాలో తెలియక చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని వైద్యులు తెలిపారు. అలాగే సర్జరీ సమయంలో బిడ్డ మరణించిందని.. బుకాయించారు. ఈ పరిణామంతో పసికందు తల్లిదండ్రులు, బంధువులు తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు.

Spread the love