నవతెలంగాణ-సిటీబ్యూరో
దేశంలో ఎన్నో వేల మంది మానసిక రోగులకు అత్యుత్తమ చికిత్సలు అందించడం ద్వారా, వారిలోని మానసిక, భావోద్వేగ, వ్యసన సంబంధిత సమస్యలకు పరిష్కారం చూపడం ద్వారా ప్రయివేటు రంగంలోని మానసిక రోగ చికిత్సాశాలలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఆశా హాస్పిటల్, తన అనుబంధ విభాగంలో ఉన్న ఆశా న్యూరో మోడ్యులేషన్ క్లినిక్ మరో శాఖను గచ్చిబౌలిలో ప్రారంభించింది. ఈ సందర్బంగా, ఏఎన్‌సీ డైరెక్టర్, ఎంఎస్ రెడ్డి మాట్లాడుతూ గచ్చిబౌలిలో తమ ఆరోశాఖను ప్రారంభించడం ద్వారా హైదరాబాద్‌లో తమ సంస్థ ఉనికిని మరింత ధృడపరచుకుంటూ ముందుకు సాగడం ఎంతో ఆనం దంగా ఉందన్నారు. నిరంతరం వేగంగా పరుగెడుతున్న జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, వాటికి అవసరమైన సత్వర పరిష్కారాల గురించి తమ సంస్థకు చాలా మంచి అవగాహనా ఉందన్నారు. అవిశ్రాంత పని ఒత్తిడిలతో కూడిన జీవన విధానం వల్ల, ప్రజలు తమలో కలిగే మానసిక ఒత్తిడిని, భావోద్వేగాలను పరిష్కరించుకోలేక, అనేక ప్రశంలు, చిక్కు సమస్యలతో సతమతమవుతున్నారు అనే విషయాన్ని తాము గమ నించగలుగుతున్నామనీ, అందుకే, ఈ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొం టున్న వివిధ రకాల సమస్యలకు తమ ఈ నూతన శాఖ ద్వారా అత్యుత్త మ వైద్య సేవలు అందించి, తమ వద్దకు వచ్చిన రోగులను ఊరట కలిగించాలన్నదే తమ ధ్యేయం అన్నారు. ”చికిత్స అనంతరం రోగికి ఏవిధమైన ఇతర సమస్యలు రాకుండా, ఒకవేళ ఏమైనా వఛ్చినా, అవి అత్యంత తక్కువగా ఉండేలా మా చికిత్సా విధానం ఉంటుంది. తమ పనులతో తీరిక లేకుండా ఉండి, సత్వర చికిత్స కోరుకునే వారికి, పాత పద్ధతుల్లో చికిత్స పొందినా ఫలితం పొందని వారికి, లేదా తమ సమస్యలకు దీర్ఘ కాలిక పరిష్కారం పొందే వారికి ఈ చికిత్సా విధానం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మందుల పట్ల విముఖత ఉండే, కేవలం కౌన్సిలింగ్ ద్వారా చికిత్స పొందాలనుకొనే వ్యక్తులకు కూడా ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుంది. ఏఎన్‌సీలో పని చేసే వైద్యుల బృందం అందరూ ఎంతో అనుభవజ్ఞులు. వారందరూ ఈ చికిత్సా విధానంలో వస్తున్న నేటి ఆధునిక వైజ్ఞానిక పరిశోధనలు, వాటి ద్వారా పేషెంట్‌లకు అందే ప్రయోజనాలను గురించి క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉన్నారు. మానసిక, భావోద్వేగ ప్రశాంతత కలిగిన జీవన విధానం అత్యంత అవసరం అనేది మా విశ్వాసం. అందుకోసం నిజాయితీగా, నిబద్దతతో సేవలు అందించాలనే మా లక్ష్యాన్ని సాధించడం ద్వారా మా రోగులకు ఈ శాఖ ద్వారా అత్యుత్తమ సేవలను అందించడం మా కర్తవ్యంగా భావిస్తున్నాం” అని తెలిపారు.