నేడు చేయూత వాహనాల ప్రారంభోత్సవం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వికలాంగుల కోసం చేయూత వాహనాలను అందించే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించనున్నట్టు రాష్ట్ర వికలాంగులు, వయోవద్ధులు, ట్రాన్స్‌జెండర్‌ శాఖ డైరెక్టర్‌ బి.శైలజ తెలిపారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లోని మలక్‌ పేటలోలోని వికలాంగుల సంక్షేమభవన్‌లో నిర్వహించే ఈ కార్యక్రమంలో అవసరమైన వారికి బ్యాటరీతో కూడిన వీల్‌ చైర్స్‌, 4జీ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఆ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అందజేస్తారని తెలిపారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా క్వాల్‌కామ్‌ కంపెనీ వీటిని అందజేస్తున్నదని తెలిపారు. వీటితో పాటు వికలాంగుల హెల్ప్‌లైన్‌ను ప్రారంభిస్తారని వివరించారు.

Spread the love