నవతెలంగాణ-ముత్తారం: ముత్తారం మండల కేంద్రంలోని కాసర్ల గడ్డ బస్టాండ్ సమీపంలో ఈ నెల 13న కెడిసిసి బ్యాంక్ ప్రారంభోత్సవం జరుగుతుందని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు గుజ్జుల రాజిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి పెద్దపల్లి జడ్పి చైర్మన్ పుట్ట మధూకర్ జాతీయ సహకార సంఘాల అధ్యక్షులు కొండూరి రవీందర్ రావు హాజరవుతారని తెలిపారు. రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.