గుజరాత్‌లో అతి పొడవైన తీగల వంతెన ప్రారంభం..

నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనను ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌లోని ద్వారకలో నేడు ప్రారంభించారు. 2.3 కిలోమీటర్ల పొడవున్న దీనికి సుదర్శన్‌ సేతు అని పేరు పెట్టారు. ఇది ఓఖా ప్రాంతాన్ని బెట్‌ ద్వారకాతో అనుసంధానిస్తుంది. ద్వారకాదీశ్‌ ఆలయ సందర్శనకు వచ్చే యాత్రికులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తం రూ.979 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. 2017 అక్టోబర్‌లో మోదీ ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

Spread the love