మండల కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘం మండల శాఖ పీఎస్ఆర్ ర్ గార్డెన్ సోమలగడ్డ క్రాస్ నందు సూది రెడ్డి జనార్దన్ రెడ్డి మండల కమిటీఅధ్యక్షులు అధ్యక్షతన ఆదివారం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని గ్రామ కమిటీలు పురుషులు మహిళా కమిటీలు మండల కమిటీ నాయకులు హాజరైనారు ముఖ్య అతిథులుగా రెడ్డి జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెండ్యాల కేశవరెడ్డి జిల్లా అధ్యక్షులు పల్లె జయపాల్ రెడ్డిగౌరవ అధ్యక్షులు కొమురెల్లి భూమిరెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు రెడ్డి సంధ్యారెడ్డి హాజరైనారు పెండ్యాల కేశవరెడ్డి లు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్కు నిధులు కేటాయించి రెడ్డి సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో ప్రధాన కార్యదర్శి అంతిరెడ్డి సత్యనారాయణరెడ్డి దేవరపల్లి మల్లారెడ్డి చింతల లింగారెడ్డి మట్ట వెంకట పాపిరెడ్డి మిరియాల యాదగిరి రెడ్డి బురెడ్డి మధుసూదన్ రెడ్డి మహిళా అధ్యక్షులు గోలి వినోద అంకిరెడ్డి రమాదేవి రెండేళ్ల భారతమ్మ వివిధ గ్రామాల అధ్యక్షులు కార్యదర్శులు సంఘ సభ్యులు పాల్గొన్నారు.