ఘనకీర్తి చాటేలా అవతరణ దినోత్సవ వేడుకలు జరగాలి

నవతెలంగాణ – (బాన్సువాడ) నసురుల్లాబాద్
ఈసారి తెలంగాణ అవతరణ వేడుకలను తెలంగాణ ఘనకీర్తి దశ దిశలా చాటేలా అవతరణ దినోత్సవ వేడుకలు జరిగేలా చూడాలని జిల్లా అధికారులకు ప్రజాప్రతినిధులకు కార్యకర్తలకు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు సోమవారం బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలోని ఓ కళ్యాణ మండపంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు సందర్భంగా జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులతో ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
జూన్‌ 2 నుంచి 21 రోజులపాటు నిర్వహించనున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జూన్ 2న ఉత్సవాలు ప్రారంభం తెలంగాణ రాష్ట్ర అవతరణ
దశాబ్ది ఉత్సవాలు. జూన్ 3న కర్షకులతో కలిసి సహపంక్తి భోజనాలు 4న సురక్షా దినోత్సవం, 5న విద్యుత్ దినోత్సవం, 6న పారిశ్రామిక రంగ దినోత్సవం, 7న సాగునీటి దినోత్సవం, 8న ఊరు రా చెరువుల పండగ, 9న సంక్షేమ సంబరాలు, 10న సుపరిపాలన దినోత్సవం,11న సాహిత్య దినోత్సవం,12న తెలంగాణ రన్ , 13న మహిళా సంక్షేమ దినోత్సవం, 14న వైద్య ఆరోగ్య దినోత్సవం,15న పల్లె ప్రగతి దినోత్సవం, 16న పట్టణ ప్రగతి దినోత్సవం, 17న తెలంగాణ గిరిజన దినోత్సవం, 18న మంచినీళ్ల పండగ, 19న హరితర దినోత్సవం, 20న విద్యాధి దినోత్సవం, 21న ఆధ్యాత్మిక దినోత్సవంలను జరుపుకోవాలని స్పీకర్ సూచించారు. పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తొమ్మిదేండ్ల అనతికాలంలోనే దేశానికే ఆదర్శంగా పాలన కొనసాగిస్తూ, పదవ వసంతంలోకి అడుగిడుతున్న చారిత్రక సందర్భంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా, ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారని తెలిపారు ఈ ఉత్సవాలు తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ఘనకీర్తి దశ దిశలా చాటేలా, ప్రతి హృదయం ఉప్పొంగేలా పండుగ వాతావరణంలో నిర్వహించాలని స్పీకర్ సూచించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని వరకు, రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2వ తారీఖు నుంచి 21 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుపుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జిల్లా రైతు సమన్వయ కన్వీనర్ అంజిరెడ్డి జిల్లా అధికారులు వివిధ డివిజన్ అధికారులు మండల స్థాయి అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love