నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో వీధి కుక్కల దాడులు ఆగటం లేదు. చిన్నారులు, ఒంటిరిగా వెళ్లే వారే లక్ష్యంగా కుక్కలు దాడులకు తెగబడుతున్నాయి. తాజాగా ఈరోజు ఉదయం 11 గంటలకు గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ నాలుగో వార్డ్ లో నాలుగేళ్ల చిన్నారిపై ఐదు కుక్కలు మరీ దారుణంగా దాడి చేశాయి. కుక్కల దాడిలో గాయపడిన చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంకా వివరాల తెలియాల్సి ఉంది.