పిల్లలను అంగన్వాడి కేంద్రాల్లో చేర్పించండి

Include children in Anganwadi centersనవతెలంగాణ – అచ్చంపేట
రెండు ఏళ్లు నిండిన పిల్లలను స్థానిక అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించాలని టీచర్లు తల్లులకు అవగాహన కల్పిస్తున్నారు. అమ్మ బాట అంగన్వాడి బాట కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 4,  19 అంగన్వాడి సెంటర్లలో మంగళవారం అవగాహన కల్పించారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పౌష్టిక ఆహారంపై తల్లులకు వివరించారు. 20వ తేదీ వరకు రెగ్యులర్ గా కార్యక్రమాలు నిర్వహించను జరుగుతుందన్నారు. 20వ తేదీన అన్ని అంగన్వాడి కేంద్రాలలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగిందని, పిల్లల ఎదుగుదల అభివృద్ధిపై చర్చించడం జరుగుతుందన్నారు.
Spread the love