అల్పాహారంలో ఇవి చేర్చండి…

ఉదయం పని ఒత్తిడిలో పడి చాలా మంది మహిళలు అల్పాహారం సంగతే మర్చిపోతారు. కానీ అల్పాహారాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు. అప్పుడే ఒబీసీటీ ఇబ్బంది వుండదు. ఉదయం పూట కడుపు నిండా తినడం ద్వారా మధ్యాహ్నం పూట మితంగా ఆహారం తీసుకోగలుగుతారు. ఇక రాత్రి పూట అంతగా ఆకలి వేయదు. ఇలా తీసుకుంటే ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. అల్పాహారంలో మరికొన్నింటిని జత చేసుకుంటే ఆరోగ్యంగా వుండగలుగుతారని వైద్యులు చెప్తున్నారు. అవేంటో చూద్దాం..
ఉదయాన్నే టిఫిన్‌లో భాగంగా రాగి జావ తీసుకోవడం ఉత్తమం. ఓట్స్‌ ఉప్మా, లేదా పాలల్లో ఓట్స్‌ వేసుకుని తీసుకోవచ్చు. పాలతో కార్న్‌ఫ్లేక్స్‌ తీసుకుంటే శరీరానికి అవసరమైన ఫైబర్‌ పుష్కలంగా లభిస్తుంది.
అల్పాహారంలో తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్‌ తప్పని సరిగా ఉండేలా చూసుకోండి. ఉడికించిన కోడి గుడ్డు రోజుకు ఒకటి అల్పాహారంలో తీసుకోవాలి.
సోయాపాలు ఆరోగ్యానికి చాలా మంచివి. మనం తీసుకునే పాల స్థానంలో వారంలో రెండు మూడు రోజులైనా సోయా పాలు తీసుకోవాలి.
వారంలో ఒక రోజయినా పూరీని అల్పాహారంగా తీసుకోండి. ముఖ్యంగా చిన్న పిల్లలకు పూరీలు, వెజిటబుల్‌ కర్రీ మంచి ఆహారం.
ఉదయం పుల్కాలు తినే వారు అందులోకి తాజా కూరగాయలతో పాటు చిరుధాన్యాలతో ఒక కూర చేసుకుంటే శరీరానికి తగిన శక్తి వస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Spread the love