నవతెలంగాణ – హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. ఈ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. తెలంగాణలో మల్టీప్లెక్స్‌లలో రూ.413, సింగిల్ స్క్రీన్లలో రూ.250, ఏపీలో మల్టీప్లెక్స్‌లలో రూ.325, సింగిల్ స్క్రీన్లలో రూ.200 వరకు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నెల 27న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.