– కేంద్ర మంత్రి తీర్మానం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ అదనపు పెంపు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు మంగళవారం పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టింది. ఉభయ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తరపున, సహాయ మంత్రి పంకజ్ చౌదరి తీర్మానం ప్రవేశపెట్టారు. పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ అదనపు పెంపుకు 2022 జులై 12న, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ అదనపు పెంపుకు 2022 జూన్ 30న చేసిన సవరణలకు సంబంధించి 2023 జులై 31న గెజిట్ ఇచ్చినట్టు తెలిపారు.