బౌండరీల దూరాన్ని పెంచండి: అనిల్ కుంబ్లే

నవతెలంగాణ – హైదరాబాద్ : పొట్టి ఫార్మాట్‌లో 200+ స్కోర్లు ఈజీగా నమోదవుతున్నందున భవిష్యత్తులో కుర్రాళ్లెవరూ బౌలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోరని కుంబ్లే అభిప్రాయపడ్డారు. అందుకే బౌండరీ లైన్ల పరిధిని పెంచాలని, డగౌట్‌ను స్టాండ్స్‌లోకి మార్చాలని ICCకి సూచించారు. ‘గ్రౌండ్ మధ్య నుంచి సమానంగా బౌండరీ లైన్లు ఏర్పాటు చేయాలి. చుట్టూ 77M దూరం ఉండాలి. స్ట్రెయిట్ బౌండరీ 64M ఉండాలి. బ్యాటింగ్, బౌలింగ్ మధ్య సమతూకం పాటించాలి’ అని అన్నారు.

Spread the love