– ఈనెల 20 నుంచి సమ్మె బాట..
– మిడ్ డే మీల్స్ వర్కర్స్ యూనియన్
– రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొరిమి సుగుణ
నవతెలంగాణ-భూపాలపల్లి టౌన్
మధ్యాహ్న భోజనం పథకం వర్కర్స్ పెంచిన బిల్లులను ఈనెల 19 లోపు బిల్లులు చెల్లించకుంటే 20 నుండి సమ్మె బాట పడతామని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొరిమి సుగుణ హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా జయశంకర్ భూ పాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు గురువారం వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం సుగుణ మా ట్లాడుతూ… అప్పులు తెచ్చి వంటలు వండి పిల్లలకు భోజనాలు పెడుతున్నారని, దీంతో వారు అప్పుల పాలై దుర్భర జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వంట కార్మికుల బిల్లులను ప్రతినెల 5వ తేదీ లోపు చెల్లించాలని అన్నారు. కేరళ ప్రభుత్వం మాదిరిగా రోజుకు రూ.600 తెలంగాణ ప్రభుత్వం చెల్లించాలని అన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. నిత్యవసర వస్తువులు ఆహార ప్రైవేటు ఏజెన్సులకు ఇవ్వొద్దన్నారు. 9, 10వ తరగతి విద్యార్థుల మెస్ బిల్లులను చెల్లించాలని కోరారు. పెరుగుతున్న వస్తువుల ధరలకు అనుగు ణంగా కోడిగుడ్లు, వంట గ్యాస్ ఇతర వస్తువుల ధరల మెనూ చార్జీలను పెంచాలని కోరారు. ప్రభుత్వ వంట సామాగ్రి నిత్యవసర వస్తువులు సరఫరా చేసి హామీ ఇచ్చి నేటికీ పంపిణీ చేయట్లేదని వాపోయారు. వం ట కార్మికుల అక్రమ తొలగింపులను నివారించాలని, పెండింగ్ వేతనాలు, బకాయి బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మెరుగు రమేష్, వంట కార్మికులు వరలక్ష్మి, స్వర్ణలత, మల్లమ్మ, రాజేశ్వరి, భవాని, భాగ్య, రజిని, రజిత, సరస్వతి, సుగుణమ్మ, పుష్ప, మరియమ్మ, సరోజన తదితరులు పాల్గొన్నారు.