పెరిగిన బంగారం ధరలు..

నవతెలంగాణ – హైదరాబాద్ : మన భారతీయ మహిళల కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇది ఇలా ఉండగా, హైదరాబాద్ నగరంలో బంగారం, వెండి ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగి రూ. 61, 800 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 56,650 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు మాత్రం తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ. 500 తగ్గి రూ. 77, 500 గా నమోదు అయింది.

Spread the love