– అక్టోబర్‌లోనూ వానలు
– ఫలితంగా పంటకోతపై ప్రభావం
– ఉత్పత్తి తగ్గటంతో పాటు నాణ్యతా పడిపోయే అవకాశం
– దేశంలో ఆహార భద్రతపైనా ఎఫెక్ట్ : వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తల ఆందోళన
న్యూఢిల్లీ: భారత్‌లో అధిక వర్షాలు అనేక రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వరదలతో ఇప్పటికే అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ భారీ వర్షాలకు పంటలు కూడా నీట మునిగాయి. రైతుకు కన్నీటిని మిగిల్చాయి. ఈ పరిస్థితులు అక్టోబర్ నెలలోనూ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత వాతావరణ సం్థ (ఐఎండీ) ఈ విషయాన్ని తెలిపింది. సాధారణంగా వర్షాకాలం సెప్టెంబర్‌లో ముగుస్తుంది. అయితే, ఈ సార అక్టోబర్ మాసం వరకూ వెళ్లనున్నదని ఐఎండీ అంచనా. అయితే, ఇదేమీ అసాధారణ విషయం కాదనీ, గత పదేండ్లుగా ఇలాంటి మార్పులు క్రమక్రమంగా వస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు.వర్షాకాల మార్పులు రైతులను, విధానకర్తలను కష్టాలు, సందిగ్ధంలోకి నెట్టేశాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ భారీ వర్షాలు, వరదలు, పంట న్టాలు వంటివి అన్నదాతలకు కష్టాలే మిగిలిస్తున్నాయనీ, నూతన పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా కొత్త వ్యవసాయ పద్ధతులను ఆచరించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
‘ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు’
వాతావరణ శాస్త్రవేత్తల సమాచారం ప్రకారం.. నైరుతి రుతుపవనాల ప్రారంభం, విరామం నెమ్మదిగా ఉన్నది. ఇది భారత్‌లో ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో అంచనా వేసినదాని కంటే ఎక్కువ భారీ వర్షాలకు కారణమవుతున్ని. గుజరాత్, రాజస్థాన్ వంటి పశ్చిమ రాష్ట్రాలు గత దశాబ్ద కాలానికి పైగా వర్షపాతంలో 30 శాతం పెరుగుదలను చూశాయి. అయితే, ఈ మార్పుల్లో ప్రత్యేకించి వర్షాకాలం పొడగింపు అక్టోబర్ నెల వరకూ పెరగటం. ఉత్తరాఖండ్, యూపీ, బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలలో రైతులు అక్టోబర్ ప్రారంభంలో పంట కోతలకు సిద్ధమవుతారు. అయితే, ఇక్కడ కురుస్తున్న అకాల వర్షాలకు అది కాస్తా ఆలస్యమయ్యే పరిస్థితులు ఇక్కడ కనిపి్తున్నాయి. దీని కారణంగా వరి, జొన్న, తృణ ధాన్యాలు వంటి పంట నాణ్యత తగ్గిపోయే ప్రమాదమున్నదని కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్వైర్‌మెంట్, వాటర్ (సీఈఈడబ్ల్యూ) సీనియర్ ప్రోగ్రామ్ లీడ్ విశ్వాస్ చితలే అన్నారు.
‘ఆహార భద్రతకు ప్రమాదం’
వాతావరణ మార్పులు భారత్‌లో రుతుపవనాల నమూనాను మార్చేశాయని పర్యావరణ నిపుణులు అంటున్నారు. అది కాస్తా అస్థిరమైన, విపరీత వర్షాలకు కారణమవుతున్నది చెప్తున్నారు. అయితే, వర్షాకాలంలో మార్పుల కారణంగా భారత్‌లో ఆహార భద్రతకు ప్రమాదం ఏర్పడుతున్నదని నిపుణులు చెప్తున్నారు. ఖరీఫ్ పంటపై అకాల వర్షాల ప్రభావం పడటంతో ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయని అంటున్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. ఈ ఏడాది భారత్‌లో 408.72 లక్షల హెక్టార్లలో వరిని నాటారు. ఇది గతేడాది విస్తీర్ణం 393.57 లక్షల హెక్టార్ల కంటే అధికం. అయితే, ఈ భారీ వర్షాలతో పం నష్టం ప్రమాదమే ఎక్కువగా ఉన్నదని నిపుణులు చెప్తున్నారు. ఫలితంగా మొత్తం ఉత్పత్తి తగ్గి అటు రైతులకు, ఇటు దేశానికి నష్టాన్నే తీసుకొచ్చే ప్రమాదమున్నదని వారు హెచ్చరిస్తున్నారు.