సీపీఐ(ఎం) అభ్యర్థులకు పెరుగుతున్న ఆదరణ

సీపీఐ(ఎం) అభ్యర్థులకు పెరుగుతున్న ఆదరణబహిరంగ సభలకు జనం హాజరు
రాజస్థాన్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సీపీఐ(ఎం) అభ్యుర్థులకు మద్దతు పెరుగుతుంది. అభ్యర్థులకు వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు, ప్రదర్శనలు జరిగాయి. ధోడ్‌లో జరిగిన భారీ ‘విజయ ప్రతిజ్ఞ’ బహిరంగ సభలో సీపీఐ(ఎం) అభ్యర్థి పేమా రామ్‌కు మద్దతుగా వేలాది మంది తరలివచ్చిన ప్రజలు ”విజయం మనదే” అని ప్రతిజ్ఞ పూనారు. ఈ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి అమ్రా రామ్‌, నాయకుడు కిషన్‌ పరీక్‌ ప్రసంగించారు. బికనీర్‌ జిల్లా దుంగర్గర్‌ లో జన ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. దుంగర్గర్‌ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) అభ్యర్థి గిరిధరి విజయాన్ని ఆకాంక్షిస్తూ చేపట్టిన ర్యాలీలో భారీస్థాయిలో రైతులు పాల్గొన్నారు. ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. సదుల్పూర్‌ సీపీఐ(ఎం) అభ్యర్థి సునీల్‌ పునియాకి మద్దతుగా భారీ బహిరంగ సభ జరిగింది.

Spread the love