సర్కార్‌ బడులకి.. పెరుగుతున్న ఆదరణ

– పాఠశాలల్లో మంచి ఫలితాలు
– ఆసక్తి చూయిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు
నవ తెలంగాణ – ఊట్కూర్‌
ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరుగుతోంది.. ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపడుతున్నాయి.. గతంలో ప్రభుత్వ పాఠశాలలు అంటే శిథిలావస్థలో భవనాలు విద్య బోధన , సౌకర్యాలు సరిగా ఉండవనే భావన ప్రజలు, విద్యా ర్థుల తల్లిదండ్రులలో ఉండేది. దీంతో ప్రైవేట్‌ పాఠశాలలకు తల్లీదండ్రులు తమ పిల్లలను పంపించడానికి ముగ్గు చూపేవారు. ప్రస్తుతం దీనికి భిన్నంగా మారి పోయింది. ప్రభుత్వ పాఠశాలల వైపు విద్యార్థులు అడుగులు వేస్తు న్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టడంతో కొన్నాళ్లుగా నుంచి ప్రభుత్వ పాఠశాలలకు డిమాండ్‌ పెరిగిందని భావన ప్రజలు వ్యక్తమవుతోంది. ప్రవేట్‌ పాఠశాలలకు గీటుగా పదవ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలు 100శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యావంతులైన ఉపాధ్యాయులు ఉండడంతో నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. ప్రభుత్వం సైతం ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులకు ఆధునిక విద్య బోధనపై శిక్షణ అందిస్తోంది. కార్పొరేట్‌ పాఠశాలకు మాదిరిగా ప్రభుత్వ పాఠశాలలో ఒకరికీ ఒకరు పోటీ తత్వం పెరిగింది. పాఠశాలలో మంచి ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యా యులు పోటీపడుతున్నారు. పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహించి సబ్జెక్టులు బోధిస్తున్నారు. విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించే విధంగా విద్యా బోధనలు చేస్తూ పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించి సత్తా చాటారు. మండలంలో 28 ప్రాథమికపాఠశాలలు 11 ప్రాథమిక ఉన్న త పాఠశాలలో ఉన్నత పాఠశాలను ఒకటి కే జీ బీ వీ పాఠశా లలు ఉన్నాయి. మండలంలోని బిజ్వార్‌, పులి మామిడి జెడ్పీహెచ్‌ఎస్‌ ఉట్కూర్‌లోని బాలికల ఉన్నత పాఠశాల పులిమామిడి కస్తూర్బా పాఠశాల చిన్న పొర్ల జిల్లా పరిషత్‌ ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో 100శాతం ఉత్తీర్ణత సాధించారు . మండలంలోని నిల్‌ గుర్తి ఎంపీయూపీఎస్‌ పాఠశాల వల్లంపల్లి ప్రైమరీ పాఠశాల అవసలోని పల్లి గ్రామంలోని యుపిఎస్‌ పాఠశాల తదితర గ్రామాలలో ప్రభుత్వం నుంచి ప్రజా ప్రతినిధులు దాతల సహకారంతో పాఠశాలలో డిజిటల్‌ తరగతులు కొనసా గుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు చదువులో మరింత ఉత్సాహంగా చదువుతూ ముందుండాలనే ఉద్దే శంతో వర్క్‌ బుక్‌ ద్వారా విద్యార్థులచే రాయించడం విద్య బోధనలు చేయించడం ఉపాధ్యా యులు కొనసాగిస్తున్నారు. అలాగే పాఠశాల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల భవనాలు అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా పనులు కొనసాగుతున్నాయి.

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ..
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధనలు జరుగుతోంది. దీంతో విద్య బోధనలో మంచి ఫలి తం వస్తుంది. ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగాప్రభుత్వ పాఠ శాలలో ఉత్తీర్ణత శాతం పెరిగిపోయింది. ప్రైవేట్‌ పాఠ శాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలకు ప్రభుత్వపాఠశాలలో చేర్పించేవిధంగా అవగాహన వస్తుంది.
– లక్ష్మారెడ్డి, ప్రధానోపాధ్యాయులు, నిల్‌గుర్తి గ్రామం, ఎంపీయూపీఎస్‌ పాఠశాల.

Spread the love