బస్టాండ్ లో పెరుగుతున్న దొంగతనాలు..

– వలిగొండ, భువనగిరిలో బైకు సెల్ఫోన్లు దొంగతనం..
– బస్టాండ్ లో పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఎండాకాలంలో ఆరు బయట నిద్రించే మహిళలు ఒంటరి మహిళలపై చోరీలకు పాల్పడుతూ చైన్స్ స్నాకింగ్ దొంగలకు పాల్పడేవారు. ప్రస్తుతం దొంగలు రూటు మార్చి బస్టాండ్లలో దొంగతనం చేస్తున్నారు. బస్టాండ్ లో ఉన్నాను నేర్చుకోవడానికి ప్రధాన కారణం రద్దీగా ఉన్నప్పుడు బస్సు ఎక్కేదిగే సందర్భంలో దొంగలు చాకచక్యంగా వారి పర్సనల్, అందులో డబ్బులను దొంగలిస్తున్నారు.
బస్టాండ్ లోనే టార్గెట్ గా దొంగతనాలు…
యాదాద్రి భువనగిరి జిల్లాలో చౌటుప్పల్, వలిగొండ, భువనగిరి , యాదగిరిగుట్ట ప్రాంతాలలో ప్రయాణికులు రద్దీగా ఉండే సమయంలో దుండగులు వారి యొక్క పర్సును నగదును కొట్టివేస్తున్నారు. బస్టాండ్లలో ఇటీవల కాలం ఉచిత బస్సు కావడంతో మహిళ ప్రయాణికులు ఎక్కువగా ఉండడం, మగవారికి సీట్లు దొరకకపోవడంతో ఆడ మగవారు సీట్ల కోసం కుస్తీ పడుతూ బస్సు ఎక్కి సందర్భంలో దుండగులు చాకచక్యంగా పర్సులను దొంగలిస్తూ, చాకచక్యంగా తప్పించుకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నార్కట్పల్లి, వలిగొండ, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, భువనగిరి, చిట్యాల ప్రాంతాలలో సెల్ ఫోన్ దొంగతనాలు ఇటీవల కాలంలో ఎక్కువగా జరిగినట్లు సమాచారం. ఈ విషయంపై కొందరు ఫిర్యాదు చేయగా, మరికొందరు ఫిర్యాదు చేయకుండానే వెళ్ళిపోతున్నారు. సెల్ఫోన్ పోగొట్టుకున్న వారు స్థానికులు కాకపోవడంతో సెల్ ఫోన్ కు సంబంధించిన సమాచారం ఐఎంఈఐ నెంబర్ ఇంటి వద్ద ఉండటంతో మళ్లీ వచ్చి ఫిర్యాదు చేసే దొరుకుతుందో లేదో, సెల్ఫోన్ బస్సు ఎక్కినప్పుడు పోయిందా బస్సు దిగేటప్పుడు పోయిందా తెలియక ఈ మండలంలో కంప్లైంట్ చేయాలో కూడా అర్థం కాక కొంతమంది  ఫిర్యాదు చేయకుండానే వెళ్ళిపోతున్నారు.
మార్చి నుంచి మే వరకు  దొంగతనం జరిగిన కొన్ని  సంఘటనలు..
యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి వలిగొండ బస్టాండ్ లో ఇటీవల కాలంలో పర్స్ దొంగతనాలు, బైకు దొంగతనాలు పెరిగిపోయాయి. మార్చి నెల 29వ వలిగొండ బస్టాండ్ లో సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం సంగుపెల్లి గ్రామానికి చెందిన భాగమల్ల ఐలయ్య యాదాద్రి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో మార్చి 29వ తేదీన బస్సు ఎక్కే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి సెల్ ఫోన్ దొంగిలించి, అతని బ్యాంక్ అకౌంట్ లో నుంచి 76,000 2500 రూపాయలను నగదు డ్రా చేశాడు. ఈ విషయంపై బాధ్యతలు వలిగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వలిగొండ మండల కేంద్రానికి చెందిన గ్రంథాలయ నిర్వాహకుడు పిట్టల  ఆంజనేయులు వలిగొండలో బస్సు నిలిచే సమయంలో అక్కడ ఉండగా అతని సెల్ ఫోన్ దొంగిలించారు. ఆయనతోపాటుగా  పాత్రికేయుల  సెల్ ఫోన్లు వలిగొండ దొంగలించబడ్డాయి. చౌటుప్పల్ ఆర్టీసీ బస్టాండ్ లో మార్చి మే నెలలో ఐదు సెల్ ఫోన్లు దొంగిలించబడ్డాయి. భువనగిరిలో ఇటీవల కాలంలో సుమారు 15 మంది పర్సులు కొట్టివేసినట్లు బాధితులు తెలిపారు. మార్చి 14వ తేదీన సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ తనకు సంబంధించిన బైకులు బస్టాండ్ పక్కన పెట్టి పేపర్ చదవడానికి ఆర్టీసీ క్యాంటీన్లో కూర్చొని అరగంటలో తిరిగి వచ్చి బైకు చూసేసరికి అతని బైకులు దొంగిలించారు. మే 11వ తేదీన భువనగిరి నుంచి ఒక పాత్రికేయుడు రాయగిరికి వెళుతుండగా అతని పర్సు ను కొట్టివేశారు.
పనిచేయని సీసీ కెమెరాలు..
భువనగిరి బస్టాండ్ లో సీసీ కెమెరా ఉన్నప్పటికీ, ఆ సిసి కెమెరా పెంచకపోవడంతో ముఖ్యంగా మహిళలు రద్దీగా ఉండడంతో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రైవేటు వాహనాలు ఆటోలు బస్సులతో పాటుగా ఉండడం మనం ఫోటోలో గమనించవచ్చు. భువనగిరి బస్టాండ్… ఆటో స్టాండ్ ఆటో స్టాండ్ అని అనిపించేలా ఆటోలు తిరుగుతూ ఉంటాయి.
Spread the love