ఢాకా: భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో బంగ్లాదేశ్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 39 పరుగుల వద్ద కెప్టెన్ లిటన్ దాస్ 10వ ఓవర్ రెండో బంతికి మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికి లిటన్ దాస్ పరుగులు చేయడంలో తడబడుతూ 23 బంతుల్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. అంతకుముందు అనముల్ హక్ వికెట్‌ను కూడా మహ్మద్ సిరాజ్ తీశాడు. రెండో ఓవర్ ఐదో బంతికి మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఓపెనర్ అనముల్ హక్ ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి వన్డేలో భారత్ గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో అనూహ్యంగా బంగ్లాదేశ్‌ను విజయం వరించింది.