– గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చిత్ర పటానికి వినతి పత్రం అందజేత
నవతెలంగాణ-మాడ్గుల
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మండలంలోని అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె మాడుగుల మండల కేంద్రంలో వేరువేరుగా కొనసాగుతోంది. సోమవారం నాటికి అంగన్‌వాడీలీీ సమ్మె 22వ రోజు అదేవిధంగా ఆశా వర్కర్ల సమ్మె ఎనిమిదవ రోజుకు చేరింది. కొనసాగుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా గాంధీ జయంతి సందర్భంగా వారు గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ అమనగల్ ప్రాజెక్టు అధ్యక్షురాలు యాదమ్మ మాట్లాడుతూ… అంగన్‌వాడీ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వ్యవహరిస్తుందన్నారు. 40ఏండ్లుగా గ్రామస్థాయిలో సేవ చేస్తున్నా, ప్రభుత్వం తమ పట్ల కనికరం చూపడం లేదని ఆమె వాపోయారు. ఇప్పటికైనా తమ న్యాయపరమైన డిమాండ్లు కనీస వేతనం రూ.26వేల పెన్షన్, ఈఎస్‌ఐ ఉద్యోగ భద్రత సౌకర్యాలు కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాటివిటీ చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు రూ.10 లక్షలు, హెల్పర్ల రూ.5 లక్షలు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆశా వర్కర్ వెంకటమ్మ మాట్లాడుతూ.. .ఆశా వర్కర్లకు ఇస్తున్న ప్రస్తుత పారితోషికం రూ.18 వేలకు పెంచి, ఫిక్స్‌డ్ వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. అంతేకాకుండా రూ.ఐదు లక్షల బీమా సౌకర్యం కల్పించి, టీబీ, లెప్రసీ, కంటీి వెలుగు తదితర ప్రింటింగ్ బిల్లు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. 2021 జులై నుంచి డిసెంబర్ వరకు ఆరు నెలల పిఆర్సి ఏరియర్స్‌తో పాటు వెంటనే చెల్లించాలన్నారు. 32 రకాల రిజిస్ట్రేషన్ ప్రింట్ చేసి ప్రభుత్వం సప్లై చేయాలని ఆశా వర్కర్లకు ప్రసూతి సెలవుల పైన సర్క్యులర్ వెంటనే జారీ చేయాలని ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీి ఉద్యోగులు గీత, రాజ్యలక్ష్మి, వెంకటమ్మ, రాణి, మంగమ్మ ,సుధారాణి, విజయ, అలివేలు, సత్తెమ్మ, రమణ, మహాలక్ష్మి, భాగ్యమ్మ, నారమ్మ, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆశా వర్కర్లు రామేశ్వరి, సువర్ణ, గీత, అరుణ, చంద్రమ్మ ,పద్మ ,సులోచన, తానమ్మ, శ్రీలత ,రేణుక తదితరులు పాల్గొన్నారు.