కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె

– అధ్యక్షురాలు పూనెం సుజాత 
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
ఆళ్ళపల్లి మండల కేంద్రంలోని తహసీల్ వద్ద బుధవారం అంగన్వాడీ కార్యకర్తల నిరవధిక సమ్మె 24వ రోజూ కొనసాగిందని ఆ సంఘం మండల అధ్యక్షురాలు పూనెం సుజాత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకంతో అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చే పరిస్థితి మాకు ఉన్నా.. మా ఇండ్లలో పిల్లలకు పౌష్టికాహారం తినిపించే పరిస్థితి మాకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమైన మా డిమాండ్లను ప్రభుత్వాలు పరిష్కరించాలని, అంత వరకు సమ్మెను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో కరకపల్లి మమత, కొమరం జయశ్రీ, కొర్స కళావతి, జోగ బుచ్చమ్మ, భద్రమ్మ, వజ్జ నాగలక్ష్మి, కొమరం మల్లుబాయి, కాలం లక్ష్మి, ఈసం లక్ష్మి, పాయం విజయ, పాయం అన్నపూర్ణ, గలిగ రత్తమ్మ, చందా సరిత, చందా కోటమ్మ, పాయం సత్యవతి, కొమరం జయచిత్ర, కొమరం పార్వతి, మద్దెల లక్ష్మి నర్సమ్మ, పూనెం లీలావతి, వట్టం పద్మ, పాయం మల్లేశ్వరి, ఈసం సుజాత, కోరం లక్ష్మి, కొమరం లక్ష్మి, పాయం సుభద్ర, పాయం సుశీల, వజ్జ సావిత్రి, ఈసం బాయమ్మ, మోకల రత్న, తదితరులు పాల్గొన్నారు.
Spread the love