గ్రామీణ తపాల శాఖలో జిడిఎస్ ల నిరవధిక సమ్మె సందర్భంగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కొరకు కేంద్ర సంఘాలు ప్రయత్నించినప్పటికీ డిమాండ్లు నెరవేర్చే సూచనలు కనబడకపోవడం వలన నిరవేదిక సమ్మె తప్ప వేరే మార్గం లేకపోవడంతో నిరవధిక సమ్మె చేస్తున్నామని ఆదివారం తెలిపారు సబ్ డివిజన్ తపాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో :12- తేదీ నుండి నుండి నిరవేధిక సమ్మె చేస్తున్నామని రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ మంథిని బీపీఎం ఏ.లింబాగౌడ్ ,ఆర్మూర్ సబ్ డివిజన్ అధ్యక్షులు మచ్చర్ల బీపీఎం ఎం.రమేష్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి పెర్కిట్ బీపీఎం పి.శ్రీనివాస్ రెడ్డి లు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిడిఎస్ ల డిమాండ్లలో ముఖ్యంగా తమ పని వేళలను 8 గంటలకు నిర్ణయించాలని, పెన్షన్ తో పాటు అన్ని ప్రయోజనాలు మంజూరు చేయాలని,టిఆర్సీఏ రేషనల్ ఫిక్సేషన్ సహా కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని,రెగ్యులర్ ఎంప్లాయిస్ కు ఇచ్చినట్లు వెయిటేజి, ఇంక్రిమెంట్స్ సీనియర్స్ కు ఇవ్వాలనీ, 12 ,24 ,36 సంవత్సరాలు పూర్తి చేసిన వారికి ఆర్థిక ఉన్నతి కల్పించాలి.గ్రూప్ ఇన్సూరెన్స్ కవరేజ్ 5 లక్షల పెంచాలని,డిపార్ట్ మెంట్ స్టాప్ తో సమానంగా జిడీఎస్ లకు గ్రాట్యూవిటీ పెంచాలి.పెయిడ్ లీవ్స్ 180 రోజుల వరకు దాచుకొని నగదుగా మార్చుకొనే సౌకర్యం కల్పించాలని,జీడీఎస్ కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యం కల్పించాలి.పూన్షన్ కాంట్రిబ్యూషన్ 3% నుండి 10% కు పెంచి రిటైర్డ్ జీడీఎస్ లకు హడాక్ పెన్షన్ మంజూరు చేయాలి.ఇన్ సెంటీవ్స్ /కమీషన్ పద్ధతులు రద్దు చేసి ప్రతీ పనిని వర్క్ లోడ్ లోకి తీసుకోవాలి అని అన్నారు.సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.జీడీఎస్ ల 5 గంటల పనికి సెకండ్ టి.ఆర్ ,సి.ఎ ఇవ్వాలి అలాగే వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి.బిజినెస్ టార్గెట్ ల పేరుతో జీడీఎస్ లను వేదించే పద్దతులను సొంత మొబైల్ ఫోన్ లను ఉపయోగించాలనే ఒత్తిడిని ఆపివేయాలి.ఫెస్ బుక్ ,ఇన్ స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా స్లాట్ ఫారంలను అనుసరించాలని బలవంత పెట్టకూడదు అని అన్నారు.
సేవలను విసృతం చేయడానికి సత్వరంగా అందించడానికి ఆర్ ఐసిటి డివైజ్ లను ఉపసంహరించి ల్యాప్ టాప్ లు ,ప్రింటర్స్ ,బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ లు బ్రాంచ్ పోస్టాఫీసులకు ఇవ్వాలన్నారు.ఈ డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మా న్యాయమైన కోరికలను తీర్చాలన్నారు.లేకపోతే నిరవధిక సమ్మెను మరింత ఉదృతం చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ పరిధిలోని 20 ఎస్ వోల బీపీఎంలు, ఏబీపీఎంలు పాల్గొన్నారు.