నవతెలంగాణ-పెద్దవంగర
మండలంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రైవేట్ సంస్థలు, పార్టీ కార్యాలయాలు, గ్రామ ప్రధాన వీధుల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఈదురు రాజేశ్వరి, తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ వీరగంటి మహేందర్, స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్సై రాజు, ఏపీఎం నరేంద్ర కుమార్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముద్దసాని సురేష్, బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెదగాని సోమయ్య, ఏఈఓలు మానస, కాటమరాజు, యశస్విని, పశు వైద్యశాలలో వీఎల్ఓ ప్రభాకర్, ఎస్బీఐ లో వీరన్న, ఆయా గ్రామాల్లో సర్పంచులు, పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. గ్రామ ప్రధాన వీధుల్లో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి, పలువురు వక్తలు స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు.