స్వాతంత్ర్య దినోత్సవం రోజునే మందు, మాంసంతో వేడుకలు

నవతెలంగాణ-హైదరాబాద్ : స్వాతంత్ర్య దినోత్సవం రోజునే మందు, మాంసంతో వేడుకలు జరుపుకున్నారు హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ మండలం వేంపల్లి వెంకట్రావుపేట శివారులో చోటు చేసుకుంది. హెల్త్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన కొందరు అధికారులు నిన్న (ఆగష్టు 15) మద్యం, మాంసంతో ఫుల్ పార్టీ చేసుకున్నారు. అంతేకాకుండా డీజే పాటలతో స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరి పార్టీ వ్యవహారాన్ని తోటి ఉద్యోగి రహస్యంగా వీడియోలు తీయడంతో పార్టీ బాగోతం బయటకొచ్చింది. అయితే స్వాతంత్ర్య దినోత్సవం రోజు అధికారులే ఈ విధంగా ప్రవర్తించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మరి హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు చేసుకున్న పార్టీపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Spread the love