బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఫైట్ చేయాలి : సీపీఐ నారాయణ

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. చతీస్ గడ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సి‌పి‌ఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ఈ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. తనదైన శైలీలో బీజేపీకి కౌంటర్ వేశారు. ముఖ్యంగా ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రాగానే టూరిజం ఆఫీస్ తగలబడింది. వందల కోట్ల అవినీతి జరిగింది. మంత్రి, ఎండి పాత్ర ఉందని అనుమానం ఉంది. కేవలం అడ్మనిస్ట్రేటివ్ ఆఫీస్ మాత్రమే తగలబడింది.టూరిజం శాఖలో అవకతవలపై విచారణ చేయాలని. ఎండి మనోహర్ పై జుడిషియల్ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేస్తున్నాం. కక్షసాధింపు, అహంభావం, అవినీతి పై ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.ఛత్తీస్ ఘడ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ లో కమ్యునిస్ట్ లకు సీట్లు ఇవ్వకపోవడం వల్ల కాంగ్రెస్ ఓడింది. ఛత్తీస్ ఘడ్ లో కమ్యునిస్ట్ పార్టీకి బలం ఉంది. ఆయా రాష్ట్రాల్లో ఓటమికి కాంగ్రెస్ సంకుచిత వైఖరినే.బీజేపీ కి వ్యతిరేకంగా ఇండియా కూటమి కలిసి ఫైట్ చేయాలి.

Spread the love