భారత్‌, ఇంగ్లాండ్‌ వార్మప్‌ వర్షార్పణం

గువహటి : 2023 ఐసీసీ ప్రపంచకప్‌పై వాతావరణ ప్రభావం పడుతోంది!. తిరువనంతపురంలో దక్షిణాఫ్రికా, అఫ్ఘనిస్థాన్‌ మ్యాచ్‌ ఇప్పటికే వర్షం కారణంగా రద్దు కాగా.. తాజాగా భారత్‌, ఇంగ్లాండ్‌ వార్మప్‌ సైతం వరుణుడి ఖాతాలో పడింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లాండ్‌తో వార్మప్‌తో ప్రపంచకప్‌ వేటలోకి పడిపోదామని ఆతిథ్య భారత్‌ ఆశించినా.. గువహటిలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం ప్రణాళికలను తలకిందులు చేసింది. దీంతో టాస్‌ పడకుండానే వార్మప్‌ మ్యాచ్‌ రద్దయ్యింది. మంగళవారం తిరువనంతపురంలో నెదర్లాండ్స్‌తో టీమ్‌ ఇండియా రెండో వార్మప్‌ ఆడనుంది.

Spread the love