శాస్త్రసాంకేతిక రంగాల్లో అగ్రరాజ్యాల సరసన భారత్‌

– కొండా సంగీతారెడ్డి
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
శాస్త్రసాంకేతిక రంగాల్లో నరేంద్ర మోడీ పాలన దక్షత, ముందు చూపుతో భారతదేశం అగ్రరాజ్యాల సరసన నిలిచిందని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సతీమణి కొండా సంగీతారెడ్డి అన్నారు. ఆదివారం రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో పర్యటించిన ఆమె పలు కమ్యూనిటీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా వచ్చినప్పటి నుంచి భారతదేశానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పెరిగిందన్నారు. రష్యా, అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, బ్రెజిల్‌ సహా పలు దేశాల అధిపతులు నరేంద్రమోడీ పాలనాదక్షతను కొనియాడుతున్నారని తెలిపారు. విజయవంతమైన పారిశ్రామిక వేత్తగా నిరూపించు కున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సామాన్య ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లో వచ్చార న్నారు. గతంలో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు చేవెళ్ల ప్రాంత అభివృద్ధికి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేసిన కృషిని ఆమె వివరించారు. వచ్చే ఎన్నిక ల్లోనూ ప్రజలంతా కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి అండగా ఉండి గెలిపించాలని కొండా సంగీతారెడ్డి కోరారు. అనంతరం కమ్యూనిటీ సభ్యుల కొండా సంగీతారెడ్డిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంట్‌ కన్వీనర్‌ మల్లారెడ్డి, అత్తాపూర్‌ బీజేపీ అధ్యక్షులు విజరుకు మార్‌, అత్తాపూర్‌ కార్పొరేటర్‌ సంగీత, కొండ గౌతమిరెడ్డి, వినోద్‌ కుమార్‌, దామోదర్‌, నరేష్‌, సంతోష్‌, ప్రమోద్‌ పాల్గొన్నారు.

Spread the love