నవతెలంగాణ-హైదరాబాద్ : ప్యారిస్ ఒలంపిక్స్ లో భారత్ కు మెడల్ ఆశలు అతి తక్కువగా ఉంది రెజ్లింగ్. టోక్యో ఒలంపిక్స్ లో భారత్ ఒక్క సిల్వర్, కాంస్య పతకాలు సాధించింది. కానీ గత ఏడాది కిందట భారత్ లో రెజ్లర్ల పోరాటంతో చాలా మంది స్టార్ రెజ్లర్లు ఈ ఒలంపిక్స్ కు ఎంపిక కాలేకపోయారు. అందుకే ఈసారి తక్కువ మందితో కూడిన రెజ్లర్ల జట్టు ప్యారిస్ లో అడుగు పెట్టిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ ఒలంపిక్స్ లో రెజ్లింగ్ తాజాగా ప్రారంభం కాగా భారత్ శుభారంభం చేసింది. మహిళల 68 కిలోల విభాగంలో భారత రెజ్లర్ నిషా ఉక్రెయిన్ రెజ్లర్ పై 6-4 తేడాతో విజయం సాధించింది. మొదటి హాఫ్ లో 1-4 తో వెనుక బడిన నిషా.. సెకండ్ హాఫ్ లో ప్రత్యధిక వకాశం ఇవ్వకుండా 5 పాయింట్స్ సాధించి 6-4 తేడాతో విజయం అందుకొని క్వాటర్ ఫైనల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. చూడాలి మరి అక్కడ ఎలాంటి ప్రదర్శన ఇస్తుంది అనేది.