భారత్, పాక్ మ్యాచ్ వర్షార్పణం

మ్యాచ్ రద్దు
మ్యాచ్ రద్దు

నవతెలంగాణ హైదరాబాద్:

శ్రీలంకలో జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. దీంతో రెండు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. తొలుత టాస్ గెలుచుకున్న టీం ఇండియా బ్యాటింగ్ ఎంచుకున్నది. రోహిత్ శర్మ 11, విరాట్ కోహ్లీ 4, శ్రేయస్ అయ్యర్ 14, శుభ్ మన్ గిల్ 10 పరుగులకే ఔటయ్యారు.25 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. 66 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోవడంతో టీం పరిస్థితి నిలకడగా ఆడుతూ చక్కదిద్దే బాధ్యతను ఇషాన్ కిషాన్, హార్దిక్ పాండ్యా చేపట్టారు.

షాదాబ్ ఖాన్ వేసిన 29వ ఓవర్ రెండో బంతికి సింగిల్ తీయడంతో ఇషాన్ కిషాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 54 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అంతకుముందు సెంచరీ దిశగా దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న ఇషాన్ కిషాన్.. పాక్ బౌలర్ హారిస్ రవూఫ్ వేసిన 38వ ఓవర్ మూడో బంతిని భారీ షాట్ కొట్టడంతో బాబర్ ఆజామ్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో టీం ఇండియా ఐదో వికెట్ కోల్పోయింది. 38 ఓవర్లు ముగిసే సమయానికి టీం ఇండియా ఐదు వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది.

ఇషాన్ కిషాన్ ఔటైన తర్వాత దూకుడుగా ఆడుతూ స్కోర్ పెంచిన హార్దిక్ పాండ్యా.. షాహీన్ అఫ్రిది వేసిన 44వ ఓవర్ తొలి బంతికి అఘా సల్మాన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. ఆపై రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ వెంట వెంటనే ఔట్ కావడంతో టీం ఇండియా కష్టాల్లో చిక్కుకుంది. 44వ ఓవర్ లో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఔటయ్యారు. 45వ ఓవర్ లో శార్దూల్ ఠాకూర్, 49వ ఓవర్ లో కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా ఔటవ్వడంతో టీం ఇండియా బ్యాటింగ్ ముగిసింది. తర్వాత పాకిస్థాన్ బ్యాటింగ్ కి దిగడానికి ముందే మళ్లీ వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ తొలుత వాయిదా వేశారు. ఎంతకీ వరుణుడు తెరిపి ఇవ్వకపోవడంతో రెండు జట్ల మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

Spread the love