నవతెలంగాణ – హైదరాబాద్: భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో తొలిసారిగా 200కుపైగా పరుగులు చేసింది. యూఏఈతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఈ ఫీట్ సాధించింది. గతంలో ఇంగ్లండ్‌పై సాధించిన 198/4 అత్యధిక స్కోరు. ఇప్పుడా రికార్డును అధిగమించింది. హర్మన్ ప్రీత్ కౌర్ (66), రిచా ఘోష్ (64) విధ్వంసంతో జట్టు 201 పరుగులు చేసింది. యూఏఈ బౌలర్లలో కవిశా 2 వికెట్లు పడగొట్టారు.