2047 నాటికి భారత్‌ అభివృద్థి చెందిన దేశం..!

– మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడి
న్యూఢిల్లీ : వచ్చే 2047 నాటికి భారత్‌ అభివృద్థి చెందిన దేశాల సరసన చేరనుందని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ అన్నారు. బిజెపి ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం నిర్వహించిన ఓ సదస్సులో మంత్రి మాట్లాడుతూ.. రాబోయే రెండేళ్లలో ప్రపంచంలోనే భారత్‌ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుందన్నారు. ఆరేళ్లలో మూడో స్థానానికి ఎగబాకొచ్చన్నారు. 2014 నుంచి ప్రధాని మోడీ ప్రభుత్వం చేపడుతున్న విధానాలే ఇందుకు కారణమన్నారు. పదో స్థానంలో ఉన్న భారత్‌ ప్రస్తుతం ఐదో స్థానానికి చేరిందన్నారు.

Spread the love