నవతెలంగాణ-హైదరాబాద్ : మొహాలీ వేదికగా నేడు భారత్-ఆసీస్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగనుంది. ప్రపంచకప్‌కు ముందు టీమిండియా, ఆసీస్‌కు ఈ టోర్నీ సన్నాహాకంగా మారింది. ఈ సిరీస్‌ను రెండు జట్లు ప్రపంచకప్‌కు ప్రాక్టీస్‌గా ఉపయోగించుకోనున్నారు. కాగా కొద్దిసేపటికి క్రితం టాస్ వేయగా భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆసీస్ బ్యాటింగ్ కు దిగనుంది. అయితే టీమిండియా సీనియర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లకు తొలి రెండు వన్డే మ్యాచ్‌లకు విశ్రాంతి ఇస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇక టీమిండియా పగ్గాలను కేఎల్ రాహుల్‌కు అప్పగించింది. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆసియాకప్ గెలిచి జోష్ మీదున్న టీమిండియా ఇప్పుడు తమ ఫోకస్ అంతా అగ్రస్థానంపైనే పెట్టింది. ప్రస్తుతం టాప్-2గా ఉన్న భారత్.. ఈ సిరీస్‌లో ఆసీస్‌ను ఓడించి ప్రపంచకప్‌లో నెంబర్.1 జట్టుగా బరిలోకి దిగాలని దృడసంకల్పంతో ఉంది. మరోవైపు కొన్ని రోజుల క్రితమే నెం.1 స్థానం నుంచి 3వ స్థానానికి పడిపోయిన ఆసీస్ కూడా ఈ టోర్నీలో మరోసారి సత్తా చాటుకోవాలని ఆతృతగా ఉంది.