నవతెలంగాణ – హైదరాబాద్
భారత్, వెస్టిండీస్ జట్లు రెండో టీ20 పోరుకు సిద్దమయ్యాయి. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడయంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో ఇరుజట్లు ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి. దాంతో, టీ20లో అరంగేట్రం చేయాలనుకున్న యశస్వీ జైస్వాల్కు నిరాశే మిగిలింది. తొలి టీ20లో కడదాకా పోరాడి ఓడిన టీమిండియా సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో ఉంది.
భారత జట్టు : ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజూ శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, ముకేశ్ కుమర్.
వెస్టిండీస్ జట్టు : కైలీ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సస్ చార్లెస్ (వికెట్ కీపర్), నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మైర్, రొవ్మన్ పావెల్(కెప్టెన్), జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకీల హొసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్కాయ్.