భారతీయుడు 2 ఫస్ట్ సింగిల్ వచ్చేసింది..

నవతెలంగాణ-హైదరాబాద్ : గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే క్లర్క్ నుంచి ఆర్డర్ లిచ్చే అధికారుల వరకు లంచం అనే మాట ఎలా నాటుకుపోయిందో చూపించిన చిత్రం భారతీయుడు. 28 ఏళ్ల తర్వాత ఈ మూవీకి సీక్వెల్గా వస్తోన్న భారతీయుడు 2 (Indian 2) మూవీని శంకర్ ఎంతో ప్రేస్టీజియస్ ఫిల్మ్గా తెరకెక్కిస్తున్నాడు. ఇదివరకే రిలీజైన ఇండియన్ ఇంట్రో గ్లింప్స్ వీడియో, పోస్టర్స్ సేనాపతి అభిమానులని తెగ ఆకట్టుకున్నాయి. తాజాగా భారతీయుడు 2 నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. “శౌరా..అగణిత సేనా సమాగం..భీరా వేఖడ్గపు ధారా..రౌరా క్షత గాత్రా భరణుడి..వౌరా పగతుర సంహారా..శిరసెత్తే శిఖరం నువ్వే..నిప్పులు గక్కే ఖడ్గం నీదే” అంటూ సాగే ఈ పాటకు జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందించారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ స్వరపరచి శ్రుతిక సముద్రలతో కలిసి పాడారు. భారతీయుడు ధైర్యం,  అతని పరాక్రమంతో అవినీతి పరులను అంతమొందించడానికి ఎలా ముందుకు సాగాడు! అనే థీమ్ తో సాగే ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం కన్ఫమ్ అనేలా ఉంది.

Spread the love